రాజ్య సభ సభ్యులుగా ప్రమాణం చేసి తొలిసారిగా కాకినాడ వస్తున్న సానా సతీష్ బాబుకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు కోనసీమ జిల్లా నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకులు గంధం పళ్లంరాజు ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. సుమారు 100 కార్లతో యువకులు, పార్టీ నేతలు భారీ ర్యాలీగా బయలుదేరడంతో అమలాపురంలో కోలాహలం నెలకొంది.