ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం బీచ్ ను ఆంధ్ర గోవా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు అన్నారు. సంక్రాంతి ఉత్సవాలు సందర్భంగా ఆదివారం ఈ-బైక్ లను ఎమ్మెల్యే ప్రారంభించారు. 13, 14, 15 తేదీల్లో మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ-బైక్ పై ఎమ్మెల్యే సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.