అమలాపురంలోని యూటీఎఫ్ హోం వద్ద యుటిఎఫ్ జిల్లా నాయకులు యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వరరావు పాల్గొని యూటీఎఫ్ జెండాను ఎగరవేశారు. అనంతరం జాతీయ గీతాలను, విప్లవ గీతాలను యూటీఎఫ్ నాయకులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యుటిఎఫ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.