ఓడలరేవు ఫిష్ లాండింగ్ కేంద్రంలో పూర్తి సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఓడలరేవు ఫిష్ లాండింగ్ కేంద్రాన్ని సందర్శించి మత్స్యకారులకు అవసరమయ్యే వేలం పాట నిర్వహణపై అధికారులతో చర్చించారు. గోపాయలంక స్లూయిజ్ వద్ద షట్టర్ గేట్లు అధ్వానంపై పరిస్థితిని పరిశీలించి నూతన గేట్లు ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.