ఈదరపల్లిలో మద్యం షాపు తొలగించాలని ధర్నా

50చూసినవారు
ఈదరపల్లిలో మద్యం షాపు తొలగించాలని విద్యార్థులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈదరపల్లి గణపతి థియేటర్ సెంటర్ లో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని రవితేజ జూనియర్ కళాశాల విద్యార్థులు, జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ విభాగం కార్యదర్శి నాగ మానస ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్