సురక్షిత మంచినీటి ట్యాంకులను సకాలంలో శుభ్రపరచాలని అల్లవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కృష్ణమోహన్ పంచాయతి సిబ్బందికి సూచించారు. అల్లవరంలో సోమవారం పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మంచినీటి ట్యాంకులను పరిశీలించి, వాటి శుభ్రతకు సంబంధించిన వివరాలను అక్కడి పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.