అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 216 జాతీయ రహదారి అభివృద్ధి పనులను 2025 జనవరి నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ శాఖ అధికారులకు, కాంట్రాక్టర్లకు కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతిపై, జాతీయ రహదారుల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. వర్షాలు తగ్గు ముఖం పట్టిన తర్వాత అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు.