కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అనపర్తి ఎస్సై శ్రీను నాయక్ అన్నారు. అనపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటుచేసిన కోడిపందాల బరులను ట్రాక్టర్ తో దున్నించి ఆయన శనివారం ధ్వంసం చేయించారు. కోడి పందేలు గుండాట ఉంటే జూద క్రీడలు వాడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి పండుగను సంప్రదాయ క్రీడలతో జరుపుకోవాలని సూచించారు.