అనపర్తిలో శ్రీ శారద సంగీత కళా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 26వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం మారెళ్ళ గంగరాజు శర్మ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎంవీ సింహాచల శాస్త్రి సుందరాకాండ హరికథ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. సుందరాకాండ ఘట్టాలను రమ్యంగా, కమనీయమైన హరి కథతో సింహాచల శాస్త్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కర్రి పద్మావతి ప్రసాద వితరణ చేశారు.