ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా పి. గన్నవరం మండలంలో గోదావరి వరద ఉద్ధృతి గురువారం మరింత పెరిగింది. ఈ మేరకు గురువారం గోదావరి అక్విడక్టులను తాకుతూ వరదనీరు ప్రవహిస్తోంది. మండలంలోని లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపై వారి నిత్య అవసరాల కోసం రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు అందించాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.