గోపాలపురం: ఇసుక పాలసీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి

81చూసినవారు
గోపాలపురం: ఇసుక పాలసీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీపై పునరాలోచన చేయాలని పీసీసీ సభ్యుడు జ్యేష్ఠ సతీష్ అన్నారు. గోపాలపురంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఇసుక అమ్మకాలు కొనుగోళ్లపై జీఎస్టీ రద్దు చేయడం హర్షణీయమన్నారు. టెండర్లు ద్వారా ప్రైవేట్ అమ్మకాలు చేపట్టి, ప్రభుత్వాదాయాన్ని మెరుగుపరిచే ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఈ పాలసీ పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్