నల్లజర్ల మండలం అనంతపల్లిలో శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహన రంగా విగ్రహాలను గురువారం ఆవిష్కరించారు. మాజీ మంత్రి తానేటి వనిత, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జనసేన నాయకుడు సువర్ణ రాజు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా ఆశయ సాధనకు కృషి చేయాలని మాజీ మంత్రి వనిత కోరారు.