ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ కూటమి అభ్యర్థి ప్యార బత్తుల రాజశేఖర్ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి, కాకినాడ జిల్లా ఇంచార్జ్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం కోసం కూటమి పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి చర్యలు చేపట్టాలన్నారు.