కాకినాడ ఎంపీ ఉదయ్ కు ఘన స్వాగతం
అమెరికాలో న్యూయార్క్ నందు జరిగిన 79 వ ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కు మంగళవారం కాకినాడలో ఘన స్వాగతం లభించింది. పది రోజులు పాటు జరిగిన ఐక్యరాజ్యసమి సమావేశాల్లో పాల్గొనేందుకు భారతదేశం నుండి 9 మంది ఎంపీలకు ఆహ్వానం అందగా, అందులో పిన్న వయసు ఎంపీ ఉదయ్ కు అవకాశం లభించింది. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.