రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలోని శాంతి సువార్త స్వస్థత శాల ఆవరణంలో బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రజలు క్రీస్తు బాలుని ఆరాధించి దైవ దీవెనలు పొందారు. రెవ. పి. షాలెం రాజు వాక్య వర్తమానం అందించగా, డాక్టర్ పి. దివి కుమార్ ప్రేమ బోధలు వినిపించారు.