కొత్తపేట: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి

80చూసినవారు
కొత్తపేట: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని జిల్లా విద్యా శాఖాధికారి షేక్ సలీం భాషా వ్యాయామ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. కొత్తపేట జెడ్పీ బాలికోన్నత పాఠశాల ఆవరణలో బుధవారం  కోనసీమ క్రీడోత్సవం - ఆటలతో ఆరోగ్యం  మండల స్థాయి ఆటల పోటీలను డీఈవో బాషా పర్యవేక్షించారు. 2 వ రోజు 6 వ తరగతి నుండి 9 వ తరగతి చదువుచున్న బాలికలకు షటిల్, బ్యాట్మెంటన్, 100 మీటర్ల , 400 మీటర్ల పరుగుల పందేలను నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్