నదీ పరివాహక ప్రాంతాల్లో వరద తాకిడికి గురయ్యే ప్రాంతాలను ఆత్రేయపురం ఎంపీడీవో నాతి బుజ్జి బుధవారం పరిశీలించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వాడపల్లి, లొల్ల గ్రామాల్లో పర్యటించి అత్యవసర పరిస్థితి ఏర్పడిన యెడల వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు నిలవ ఉండకుండా శానిటేషన్ చేయాలన్నారు. అంతకు ముందు అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.