కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు, టెక్నీషియన్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని, ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని అసెంబ్లీ సమావేశంలో బుధవారం ప్రతిపాదించారు. ఆసుపత్రిని డెవలప్ చేయడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.