జిల్లాలో రైతులకి ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రెవెన్యూ డివిజన్ అధికారి రాణి సుస్మిత అన్నారు. సోమవారం సాయంత్రం తాళ్లపూడి మండలం మలకపల్లిలో ఎల్. ఎస్. సీ సొసైటీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రైతులకి ఫెర్టిలైజర్లు సరఫరా చేసే క్రమంలో రైతు వివరాలు, ఆధార్ కార్డు సంఖ్య ఆధారంగానే సరఫరా చేయాలన్నారు.