కొవ్వూరు నియోజవర్గంలోని చాగల్లు మండలం పంగిడి, మీనానగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం భానుడు భగ్గుమనగా మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తద్వారా రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గంటన్నర సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.