మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను గురువారం తిరుమలలో టీడీపీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్ధం వేగుళ్ళతో తిరుమల వెళ్ళిన కొందరు నాయకులు, అభిమానులు స్వామి వారి దర్శనానంతరం అభిమానులు వేగుళ్ళతో కేక్ కట్ చేయించి పుట్టిరోజు శుభాకాంక్షలు తెలియజేసినట్లు టిడిపి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.