ఘనంగా యోగా దినోత్సవం వేడుకలు

63చూసినవారు
ఘనంగా యోగా దినోత్సవం వేడుకలు
భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన యోగ సాధన చేయుట ద్వారా మంచి ఫలితాలను సాధించ వచ్చని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం నందు శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులలో ఏకాగ్రత పెంపొందడానికి యోగ ఒక సాధనమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ఎస్ కే ఆర్ ఎం కుమార్ అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు ఎం అంజిబాబు విద్యార్థులచే పలు ఆసనాలు వేయించి వాటి ఉపయోగాలను వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్