ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ముమ్మిడివరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. నగర పంచాయతీ పరిధిలోని విష్ణాలయం సెంటర్లో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఏళ్లు గడిచినా ఫోటోలు సజీవ జ్ఞాపకాలుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రఫీ యూనియన్ ప్రెసిడెంట్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.