కాట్రేనికోన మండల పరిధిలోని గెద్దనపల్లి గ్రామంలో పశువుల ఆసుపత్రి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లులు చెల్లింపు కాకపోవడంతో నిర్మాణ పనులను నిలిపివేయడం జరిగిందని సంబంధిత కాంట్రాక్టర్ తెలిపారు. దీనిపై అధికారులు స్పందించి భవన నిర్మాణ బిల్లులను వచ్చేలా చూసి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామ పరిసర ప్రాంతాలలోని పాడి రైతులు గురువారం కోరారు.