కాట్రేనికోన మండలం పల్లంకుర్రు శివారు మచ్చా వారిపేటలో సీసీ రోడ్డు పగుళ్లు ఏర్పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోందని స్థానికులు అంటున్నారు. సుమారు పదేళ్ళ కిందట నిర్మించిన సీసీ రోడ్డుకు 30 మీటర్ల మేర పగుళ్లు ఏర్పడ్డాయి. ఇక్కడ పొరపాటున అదుపుతప్పితే జారిపడి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అధికారులు స్పందించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.