ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామం మునుకోటివారిపాలెంలో మంగళవారం తాచుపాము హల్చల్ చేసింది. గ్రామానికి చెందిన మగాపు వెంకటేశ్వరరావు నివాస గృహం ఆవరణలో పామును చూసి ఇంట్లోని వ్యక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకి సమాచారం అందించారు. గణేశ్ వర్మ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాముని చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించారు.