యానాం నవోదయలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను విద్యాలయ వార్షిక క్రీడా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రారంభ వేడుకలకు డెలిగేట్ పి. ఎల్. ప్రవీణ్ హాజరయ్యారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం, క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. క్రీడలు, విద్యార్థుల జీవితంలో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉంటాయని అన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని కోరారు.