
ముమ్మిడివరం: చికెన్, గుడ్ల అమ్మకాలు నిలిపివేయాలి
ముమ్మిడివరం నగర పంచాయతీలో కమిషనర్ రవివర్మ శనివారం సమావేశం నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, చికెన్ షాపులు, రెస్టారెంట్ యజమానులు బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా చికెన్-ఎగ్స్ అమ్మకాలు నిలిపివేయాలని పేర్కొన్నారు. ఆదివారం నుంచి చికెన్-ఎగ్స్ నిభందనలకు లోబడి విక్రయాలు చేయాలని ఆదేశించారు. కుళ్లిపోయిన, నిల్వ ఉన్న మాంసం విక్రయించరాదని పేర్కొన్నారు. ఛాంబర్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.