నిడదవోలు మండలంలోని రావిమెట్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జీ. శ్రీనివాస్ నాయుడు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా నంగాలమ్మ ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.