ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఉండి నియోజకవర్గానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ను నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు విషయాలు, నియోజకవర్గంలోని అభివృద్ధి గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.