గొల్లప్రోలు: జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు

78చూసినవారు
సంక్రాంతి నేపథ్యంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, జూద క్రీడలు, కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని గొల్లప్రోలు ఎస్ఐ ఎన్. రామకృష్ణ తెలిపారు. గొల్లప్రోలు మండలంలో వివిధ గ్రామాల్లో ఆదివారం సిబ్బందితో కలిసి బరులు ఏర్పాటు చేసేటటువంటి ప్రదేశాలను పరిశీలించారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యుల మధ్య సుఖ సంతోషాలతో చేసుకోవాలని తెలిపారు. జూద క్రీడల జోలికి పోయి జేబులు ఖాళీ చేసుకోవద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్