దక్షిణ కాశీగా విరాజల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని మంగళవారం ప్రముఖ సినీ నటుడు ఆది కుటుంబ సమేతంగా సందర్శించారు. ముందుగా కుక్కుటేశ్వర స్వామికి, రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురుహూతిక అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సినీనటుడు ఆది దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని, అమ్మవారి కుంకుమను అందజేశారు.