కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అనగా గురువారం కనకదుర్గ అమ్మవారిని లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ పర్వత జానకి దేవి రాజబాబు, పర్వత వివేకానంద, దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.