సీతానగరం:  బంగారు ఆభరణాలు చోరీపై కేసు

57చూసినవారు
సీతానగరం:  బంగారు ఆభరణాలు చోరీపై కేసు
సీతానగరం గ్రామంలోని దేవాంగుల వీధిలోనీ ఝాన్సీలక్ష్మీ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఎస్ఐ రామ్ కుమార్ ఆదివారం తెలిపారు. బాధితురాలు ఈ నెల 15న పాలకొల్లులో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి 19న సీతానగరంలోని ఇంటికి చేరుకున్నారన్నారు. బీరువాలో ఉంచిన ఆరు తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఆమె ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్