రామచంద్రపురం పట్టణం లోని టిడిపి కార్యాలయం వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను శనివారం ఏర్పాటు చేశారు. మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గం లో వైద్యంచేయించుకోలేని నిరుపేద చిన్నారులకు సంబంధించి ఆనేక అనారోగ్య సమస్యలకు మెడికల్ క్యాంపు లో పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఆపరేషన్లకు ఏర్పాటు చేస్తామన్నారు. వైద్యులు చిన్నారులకు అవసరమైన మెడిసిన్ అందజేశారు.