రామచంద్రపురం పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ ఆకస్మికంగా శుక్రవారం సందర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడి వారికి ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందుతుందో లేదో అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే సౌకర్యాలను కూడా మరింత మెరుగుపరిచేలా చూడాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెంట్ డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.