సమస్యల పరిష్కారమే దిశగా కార్యాచరణ చేపట్టామని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ-పంచాయితీ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ విధులతో శాశ్వత ప్రాతిపదికన సిమెంట్ కాంక్రీట్ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా అభివృద్ధికి నోచుకోని వాటికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. కూటమి నేతలు పాల్గొన్నారు.