మామిడికుదురు మండలం ఆదుర్రు నుంచి అమలాపురానికి ఆర్టీసీ బస్ సర్వీస్ శుక్రవారం ప్రారంభించారు. సర్పంచులు బల్ల శ్రీనివాసరావు, అడబాల తాతకాపు బస్సు వద్ద కొబ్బరికాయ కొట్టి సర్వీసును ప్రారంభించారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో గతంలో ఉన్న ఆదుర్రు ఆర్టీసీ సర్వీసును రద్దు చేశారని సభ్యులు ప్రస్తావించారు. దాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు పునరుద్ధరించారు.