అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 46. 5 మి. మీ. సగటు వర్షపాతం నమోదైందని బుధవారం అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాలో అత్యధికంగా కొత్తపేట మండలంలో 109. 2, అత్యల్పంగా మలికిపురంలో 10. 6 మి. మీ. వర్షపాతం నమోదైందని వివరించారు. కాగా ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమేమయ్యాయి.