రెండు రోజులుగా ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, కాలువలు ఉప్పొంగుతున్నాయి. ఇదిలా ఉండగా గురువారం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో వరద నీరు వచ్చి చేరింది. వరద నీటిలో చేపలు రోడ్లపైకి రావడంతో స్థానికులు వలలు వేసి వాటిని పట్టుకుంటున్నారు. చేపలు రోడ్లపైకి రావడంతో వాటిని చూసేందు జనం ఎగబడుతున్నారు.