మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం, ఇరుసుమండ గ్రామాల్లో అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ముగ్గురు పేషెంట్లకు మంగళవారం రూ. 30 వేల ఆర్థిక సహాయం అందించారు. వసుధా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటరామరాజు అందించిన ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేనా స్థానిక ప్రతినిధి జంపన బుజ్జిరాజు రోగులకు అందజేశారు. కృష్ణ మాణిక్యాలరావు, నూకారావు, గోపాలస్వామిలకు ఒక్కొక్కరికి రూ.10వేల వంతున సాయం అందించారు.