ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని మాజీ జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు అన్నారు. ఆయన మామిడికుదురు మండలంలోని మగటపల్లిలో లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన
ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్లను శుక్రవారం అందజేశారు. హామీల అమలులో భాగంగా దీపం పథకం ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తుందని తెలిపారు.