రాజోలు మండలం సోంపల్లిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పాల కోడేరుకు చెందిన కె. బాబి(కార్తీక్) తలకు తీవ్రగాయం కాగా పి. గన్నవరం మండలం వాడ్రేవుపల్లికి చెందిన పితాని వరుణ్ కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.