బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాజోలు మండలంలో బుధవారం ఉదయం నుంచి చిరుజల్లు కురుస్తున్నాయి. తెల్లవారుజామున నుంచి మేఘాలతో వాతావరణం చల్లబడి మోస్తరు వర్షం కురిసింది. అప్రమత్తమైన రైతులు ధాన్యం రాశులపై బరకాలు కప్పి ఒబ్బిడి చేసుకునే పనులలో నిమగ్నమయ్యారు. తుపాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.