రాజోలు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నుంచి మంగళవారం తీవ్ర స్థాయిలో పొగ వెలువడింది. సఖినేటిపల్లి రేవు నుంచి వస్తున్న క్రమంలో ఈ పొగ వెలువడటంతో అందులోని ప్రయాణికులు, బస్సు వెనకాల వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ అధికారులు తక్షణం స్పందించి పొల్యూషన్ అదుపు చేయాలని డిమాండ్ చేశారు.