తుని నియోజకవర్గానికి సంబంధించి గడ్డిపేట, చేపూరు తదితర గ్రామాల్లో జరిగిన సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి గురువారం తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరంలో గెలుపొందిన మహిళలకు,చిన్నారులకు ప్రత్యేక బహుమతులు స్వయంగా అందించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే యనమల దివ్యకు గ్రామస్థులు, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.