ప్రజలకు స్వేచ్చాయుత పరిపాలన అందిస్తూ తమ ప్రభుత్వం ప్రజలచే ఇది మంచి ప్రభుత్వం అని ప్రశంసలు అందుకుంటోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇది మంచి ప్రభుత్వం గ్రామసభ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతకు 16, 437 ఉద్యోగాలు, పింఛన్ ఒకేసారి రూ. 4వేలకు పెంచారన్నారు.