ముంబయి వీధుల్లో ఈశా, ఆకాశ్ అంబానీ నైట్ రైడ్ (వీడియో)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ గారాలపట్టి ఈశా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ రోల్స్ రాయిస్ ఓపెన్ టాప్ కారులో ముంబయి వీధుల్లో ఇటీవల రాత్రి వేళ చక్కర్లు కొట్టారు. వీరితో పాటు ఆకాశ్ సతీమణి శ్లోకా మెహతా కూడా ఉన్నారు. తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. వారి కారు వెనకే భద్రతా సిబ్బంది ప్రయాణించారు. ‘‘సామాన్యుల వలే వారికీ ఎంజాయ్ చేయాలని ఉంటుంది’’.. ‘‘కుటుంబంతో జాలీ రైడ్.. వాట్ ఏ మూమెంట్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.