అవనిగడ్డ: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మన లక్ష్యం కావాలి

61చూసినవారు
అవనిగడ్డ: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మన లక్ష్యం కావాలి
గోగినేనిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విజయభేరి" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి.పి.ఆర్.టి.యు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి. శ్రీను అతిథిగా హాజరయ్యారు. నేటి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ప్రతిభ కనబరుస్తున్నాయని ప్రశంసించారు. గోగినేనిపాలెం జడ్పీ హైస్కూల్ గత సంవత్సరం 92.4 శాతం ఉత్తీర్ణతతో మండల స్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం అభినందనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్