మచిలీపట్నం పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి పద్మావతి చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంసాపత్రం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. శ్రీలత అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు ఆమెను అభినందించారు.